Monday, February 12, 2018

నా చిన్నపుడు అమ్మ గురించి ఒక కథ విన్నా.... ప్రియురాలి కోసం అమ్మ గుండె తీసుకుని వెళ్తున్న కొడుకు పడిపోతే..ఆ తల్లి గుండె "జాగ్రత్త బాబు మెల్లగా వెళ్లు" అంటుంది.ఈ కథ విన్నప్పుడు అమ్మ అంటే అధ్బుతం అనిపించింది.. అంతకన్నా ఆలోచన రాలేదు....
కాని పెద్దయ్యీ ఆలోచన పెరిగి అనిపించింది... అమ్మ గుండె కొడుకుల కోసమే కొట్టుకుంటుందా.... కూతురి కోసం కూడా అంతే తపిస్తుందా.... కూతురి కోసం కూడా అని ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు
చెప్పేవాళ్ళంతా.."పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.. కన్యాశుల్కం.. సతీసహగమనం....బాల్య వివాహాలు.. వరకట్నం.... అత్తారింటిలో కాలిపోయన కోడలు... నమ్మిన వాడి చేతిలో మోసపోయి ఉరేసుకున్న కూతురు"..... ఇక్కడ ఎక్కడా కూతురి కోసం అమ్మ లేదు.....
పూర్ణమ్మ లాంటి కూతురి గుండె అడుగుతుంది.....
"**అమ్మ నా కోసం కూడా తపించవా.. .... కష్టాల కడలిని కళ్ళు మూసుకుని ఈదేస్తూ ప్రపంచాన్ని జయిస్తాను"....
అమ్మ నా మాట వింటున్నావా?.............