Saturday, May 26, 2018


ఏమో పెద్దోళ్ళు చెప్పారు
**********************
అమ్మా ఎందుకేడుస్తున్నావే
ఆడపిల్ల తో కష్టాలు ఉంటాయటా
ఎవరు చెప్పారే
ఏమో పెద్దోళ్ళు చెప్పారు
అమ్మా నాకు వేరే గౌను కావాలే
ఆడపిల్ల అట్లాంటి బట్టలేసుకోవద్దంటా
ఎవరు చెప్పారే
ఏమో పెద్దోళ్ళు చెప్పారు
అమ్మా బడికెల్తానే
ఆడపిల్ల కు చదువు అవసరం లేదటా
ఎవరు చెప్పారే
ఏమో పెద్దోళ్ళు చెప్పారు
అమ్మా నన్న పాడు చేసారే
ఆ సంగతి ఎవరికీ చెప్పకుడదటా
ఎవరు చెప్పారే
ఏమో పెద్దోళ్ళు చెప్పారు
అమ్మా పెళ్లొద్దు ఆడుకొంటానే
ఆడపిల్ల కు ఇప్పుడే పెళ్లి చేయాలటా
ఎవరు చెప్పారే
ఏమో పెద్దోళ్ళు చెప్పారు
అమ్మా నా మొగుడు నన్ను కాల్చేసాడే
ఆ మాట పోలీసుల తో చెప్పకూడదటా
ఎవరు చెప్పారే
ఏమో పెద్దోళ్ళు చెప్పారు

Friday, May 18, 2018


ప్రతి రోజు కి పగలు రాత్రి ఉంటుంది
ప్రతి మనిషి లో మంచి చెడు ఉంటుంది
ప్రతి చర్య కు గెలుపు ఓటమి ఉంటుంది
ప్రతి కన్నీరు కి సంతోషం దుఃఖం ఉంటుంది
వెలుతురు ని ఆస్వాదించండం అలవాటు చేసుకుంటే
చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది
మనిషి లోని మంచి ని తెలుసుకోగలగితే
చెడు లో ఉండే మంచి తెలుస్తుంది
గెలుపు ని అర్థం చేసుకోగలిగితే
ఓటమి నుంచి గెలుపు కి దారి దొరుకుతుంది
ఆలోచన మార్చుకొంటే తలరాత మారుతుంది

Monday, May 7, 2018

మనిషి కి మూలం ఏది
కులానికి నిర్వచనం ఏంటి
మతానికి ప్రామాణికం ఏదీ
అసలు వాటి మధ్య తేడా ఏంటి
మనిషి మనుగడ నిర్దేశించేది ఏది
తరాల నుంచి వేధిస్తున్న ప్రశ్నలు
తర్కించినా జవాబు దొరకని సమస్యలు

Friday, March 16, 2018

వికాసం అంటే
వివేకం మర్చిపోవడం కాదు
విజ్ఞత పెంచుకోవడం
నిన్న భర్త బాధించాడు
ఈ రోజు భార్య సాధిస్తుంది
దశకం మారింది
దృశ్యం మారింది
బాధ నివృత్తి కాకుండానే
భావం ఆవృతం అయింది

Monday, February 12, 2018

నా చిన్నపుడు అమ్మ గురించి ఒక కథ విన్నా.... ప్రియురాలి కోసం అమ్మ గుండె తీసుకుని వెళ్తున్న కొడుకు పడిపోతే..ఆ తల్లి గుండె "జాగ్రత్త బాబు మెల్లగా వెళ్లు" అంటుంది.ఈ కథ విన్నప్పుడు అమ్మ అంటే అధ్బుతం అనిపించింది.. అంతకన్నా ఆలోచన రాలేదు....
కాని పెద్దయ్యీ ఆలోచన పెరిగి అనిపించింది... అమ్మ గుండె కొడుకుల కోసమే కొట్టుకుంటుందా.... కూతురి కోసం కూడా అంతే తపిస్తుందా.... కూతురి కోసం కూడా అని ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు
చెప్పేవాళ్ళంతా.."పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.. కన్యాశుల్కం.. సతీసహగమనం....బాల్య వివాహాలు.. వరకట్నం.... అత్తారింటిలో కాలిపోయన కోడలు... నమ్మిన వాడి చేతిలో మోసపోయి ఉరేసుకున్న కూతురు"..... ఇక్కడ ఎక్కడా కూతురి కోసం అమ్మ లేదు.....
పూర్ణమ్మ లాంటి కూతురి గుండె అడుగుతుంది.....
"**అమ్మ నా కోసం కూడా తపించవా.. .... కష్టాల కడలిని కళ్ళు మూసుకుని ఈదేస్తూ ప్రపంచాన్ని జయిస్తాను"....
అమ్మ నా మాట వింటున్నావా?.............