Thursday, March 23, 2017

సృష్టి  లో స్త్రీ​ పురుషులు ‌‌‌‌‌‌‌సమానం
 ‌‌‌‌‌‌‌‌‌‌గర్భం ప్రకృతి ధర్మం...
వివాహం సమాజ ధర్మం
ధర్మ విరుధ్ధంగా ప్రవర్తిస్తే మానవ ప్రగతి శూన్యం
పుట్టే ప్రతి బిడ్డకీ తండ్రెవరో నిరూపీంచే దౌర్భాగ్యం నుండి
రక్షించిన ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది
సమానత్వం ఒకరిస్తేనో మనం లాక్కుంటేనో వచ్చేది కాదు
అది మన వ్యక్తిత్వం సంసారంలో మనకిచ్చే బహుమతి...
స్త్రీ ఔన్నత్యం అద్దం లో కనిపించే కొండలాంంటిది..
దాని విలువ ఎప్పుడూ ఒకలాగే వుంటుంది...
అర్థం చేసుకోవడంలోనే విలువ మారుతుంది.....

Wednesday, March 22, 2017

    నన్ను శాసించే వాళ్ళు లేరు
నన్ను ఆశించే వాళ్ళు లేరు
        నన్ను కోరే వాళ్ళు లేరు​
నన్ను కోప్పడే వాళ్ళు లేరు
.      నన్ను అడిగే వారు లేరు
నా గురించి ఆలోచించేవారు లేరు
        నన్ను శూన్యంగా వదిలేసి
అంతా నన్ను ప్రేమిస్తున్నాం అంటున్నారు
              ఇదే ప్రేమయితే నేను శూన్యం అవుతాను.....